ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!
పాన్ ఇండియా సినిమాలు గ్లోబల్ స్థాయికి చేరుకోవడంతో మేకర్స్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒకే సినిమాలో పలువురు స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ భారీ ఆకర్షణ సృష్టిస్తున్నారు. 'రాకా', 'టాక్సిక్' వంటి చిత్రాల్లో బాలీవుడ్, సౌత్, పంజాబీ భామలు కలిసి నటిస్తున్నారు. గ్లామర్‌తో పాటు యాక్షన్, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో హీరోయిన్లు గ్లోబల్ ప్రాజెక్టుల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
ఒకప్పుడు పెద్ద సినిమా అంటే ఒకరో ఇద్దరో హీరోయిన్లు ఉండేవారు. కానీ ఇప్పుడు స్కేల్ పెరిగింది… గ్లోబల్ రేంజ్‌లో సినిమాలు తెరకెక్కుతుండటంతో మేకర్స్ స్ట్రాటజీ కూడా పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఒక్క సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. సౌత్, నార్త్, పంజాబీ అన్న తేడా లేకుండా క్రేజీ బ్యూటీస్ అందరినీ ఒకే ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తూ… గ్లోబల్ మూవీస్‌లో గ్లామర్ టచ్‌కు కొత్త మీనింగ్ చెబుతున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ రాకాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో పంజాబీ హీరోయిన్ నైలా గ్రేవల్ కొత్తగా జాయిన్ అయ్యారు. 11 ఏళ్ల తన కల ఈ సినిమాతో నెరవేరిందంటూ ఈ బ్యూటీ ఎమోషనల్ అవుతున్నారు. కథతో పాటు సినిమాలో గ్లామర్‌కి కూడా మ్యాగ్జిమమ్ స్కోప్ ఇస్తున్నారు మేకర్స్. టాక్సిక్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో పాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్లతో పాటు రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లంటే కేవలం సాంగ్స్ కే పరిమితం అనే కామెంట్స్ వినిపించేవి. కానీ ఇప్పుడు గ్లోబల్ మూవీస్ లో ఆ సినారియో మారిపోయింది. గ్లామర్ తో పాటు యాక్షన్, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో మెరుస్తున్నారు బ్యూటీస్. బాలీవుడ్ భామలు సౌత్ బాట పడుతుంటే.. సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ మూవీస్ లో ఛాన్సులు కొట్టేస్తూ.. భారీ ప్రాజెక్టులకు ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!
Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!
టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!
స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!