ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

Edited By: Phani CH

Updated on: Dec 05, 2025 | 5:04 PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకేసారి అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘దృశ్యం 3’ షూటింగ్ ఊహించని విధంగా పూర్తి చేసి వచ్చే సమ్మర్‌కు సిద్ధం చేస్తుండగా, మమ్ముట్టితో ‘పేట్రియాట్’ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ‘జైలర్ 2’లో కీలక పాత్రలో నటిస్తూ, తన దూకుడుకు ఎవరూ సాటిలేరని నిరూపిస్తున్నారు.

స్పీడు గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఫ్లాష్‌ అవుతున్నారు మలయాళ మూవీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. సెట్స్ మీద సినిమాలు.. థియేటర్లలో సినిమాలు.. అదర్‌ లాంగ్వేజెస్‌లో సినిమాలు.. ఇన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటూ అవాక్కవుతున్నారు ఫెలో ఆర్టిస్టులు. ఇంతకీ ఇప్పుడు మోహన్‌లాల్‌ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నట్టు? దృశ్యం థర్డ్ చాప్టర్‌ని ఈ డిసెంబర్‌లో షురూ చేస్తారని అందరూ అనుకుంటూ ఉంటే… ‘మేం ఎప్పుడో షూట్‌ కంప్లీట్‌ చేసేశామోచ్‌’ అని అనౌన్స్ మెంట్‌ ఇచ్చేసింది టీమ్‌. ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు సినీ జనాలు. మీరు అదే ఆశ్చర్యంలో ఉండండి.. మేం నెక్స్ట్ సమ్మర్‌లో డబుల్‌ వావ్‌ ఫ్యాక్టర్స్ ని పరిచయం చేస్తామంటున్నారు లాల్‌. నెక్స్ట్ సమ్మర్‌లో దృశ్యం3తో పాటు పేట్రియాట్‌తోనూ పలకరించడానికి రెడీ అవుతున్నారు మోహన్‌లాల్‌. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కలిసి చేసిన ఈ సినిమాను ఏప్రిల్‌కి రిలీజ్‌ చేయాలన్నది ప్లాన్‌. ఓ వైపు మలయాళ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు అదర్‌ లాంగ్వేజెస్‌ మూవీస్‌ షూట్‌లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తున్నారు మోహన్‌లాల్‌. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న జైలర్‌ సీక్వెల్‌లో కీ రోల్‌ చేస్తున్నారు లాల్‌ ఏట్టన్‌. మ్యాథ్యూ రోల్‌ని ఫస్ట్ పార్టుతో పోలిస్తే.. ఈ సారి మరింత ఆసక్తికరంగా మలిచారట కెప్టెన్‌. ఆల్రెడీ షూట్‌లో జాయిన్‌ అయ్యారు మోహన్‌లాల్‌. ఆయన స్పీడుని గమనిస్తున్నవారు.. నీ దూకుడు సాటెవ్వరూ అంటూ హుషారుగా పొగిడేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే

సామ్‌ రూట్లో సంయుక్త… ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు

Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌