మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. మోదీ, పవన్ ప్రత్యేక అభినందనలు

Updated on: Sep 22, 2025 | 6:57 PM

సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం 2023కి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 23న ఈ అవార్డును కేంద్రం ప్రదానం చేయనుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న మోహన్ లాల్.. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు.

దీంతో మోహన్ లాల్‌ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు మోదీ. ‘మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. ఆయన ఎన్నో దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు . ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు మోదీ. మోహన్ లాల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రముఖ నటులు మోహన్‌లాల్‌ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం. మోహన్‌లాల్‌ కి హృదయపూర్వక అభినందనలు. అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడాయన. కథానాయకుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఐదు జాతీయ అవార్డులు పొందారు. తెలుగులో ఆయన నటించిన సినిమాలు తక్కువేగానీ అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారు. ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటివి తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయి. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: తెలంగాణాలో మళ్ళీ జోరుగా కురుస్తున్న వర్షం

రజనీకాంత్‌కు గుడికట్టి పూజలు చేస్తున్న ఫ్యాన్.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రూ.300 కోట్లతో దుర్గా మండపం.. ఎక్కడో తెలుసా

రూ. 150కే కార్టన్ బీర్లు, మేకపోతు.. బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్

పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా