రూ. 150కే కార్టన్ బీర్లు, మేకపోతు.. బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్
దసరా వేడుకల్లో భాగంగా పలువురు లక్కీడ్రాలు నిర్వహిస్తారు. సాధారణంగా ఇలాంటి లక్కీ డ్రాల్లో సైకిళ్లు, బైకులు, కార్లు లాంటివి పెడతారు. కానీ జగిత్యాల జిల్లాలో లక్కీడ్రాలో భాగంగా విచిత్రమైన ఆఫర్లు ప్రకటించారు. లక్కీడ్రాలో మేకపోతు, కార్టన్ బీర్లు మొదటి ,రెండో బహుమతిగా ప్రకటించారు నిర్వాహకులు. దీంతో మందుబాబులకు నిజంగా పండగ వచ్చినట్టుంది.
దీంతో.. వారంతా రూ. 150 చెల్లించి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. తమ అదృష్టం కలిసొస్తే.. పెద్ద పండుగ పూట.. వేలకు వేలు ఖర్చుపెట్టి… మేకపోతును కొనే పని తప్పుతుందని పోటీపడి కూపన్స్ కొనుగోలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో దసరా ఉత్సవాల సందడి మొదైలంది. కొందరు నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటించారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా మేకపోతు, రెండో బహుమతిగా కార్టన్ బీర్లు, మూడవ బహుమతిగా ఫుల్ బాటిల్ మద్యం, నాలుగో బహుమతిగా మంచి నాటు కోడి, ఐదవ బహుమతిగా చీరను నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీ గురించి సోషల్ మీడియాలో, లోకల్‌గా బాగా ప్రచారం చేసేశారు. దీంతో.. ఎక్కడెక్కడి జనం వచ్చి కూపన్లు కొంటున్నారు. దసరాకు ముందు డ్రా తీస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో టికెట్లు కొనుగోలు చేసిన వారంతా మేకపోతు, కార్టన్ బీర్లు వంటి బహుమతులు ప్రకటించే లక్కీ డ్రా రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

