రూ.235 కోట్లు వసూలు చేసిన తుడురుమ్‌ మూవీ ఇప్పుడు OTTలో…

Updated on: May 28, 2025 | 2:46 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ కు అయితే ఈ వారం పండగే ఎందుకంటే నాని హిట్ 3, సూర్య రెట్రో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ మూవీ చేరింది.

ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదలైన మోహన్ లాల్ తుడురుమ్‌ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు కేరళలో రూ.100 కోట్లు, వరల్డ్‌ వైడ్ రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా రికార్డుల కెక్కింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నిజానికి మే మూడవ వారంలోనే మోహన్ లాల్ తుడురుమ్ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే థియేటర్లలో వసూళ్లు ఏ మాత్రం తగ్గకపోవడంతో..ఓటీటీ సంస్థ దానిని ఒక వారం వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ మే30న ఓటీటీలోకి రానుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహనల్ లాల్ ఇందులో హీరోగా నటించాడు. అలనాటి అందాల తార శోభన మరో కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 30 నుంచి తుడరుమ్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్ స్టార్ వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెడ్డీపై హీరో సాహసయాత్ర.. పోలీసుల వరకు మ్యాటర్

రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన

సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన

మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్‌ చోరీ..