మిరాయ్‌ డైరెక్టర్‌కు.. ప్రొడ్యూసర్‌ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

Updated on: Sep 18, 2025 | 1:20 PM

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన మిరాయ్‌ మూవీ.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ఏకంగా 100 కోట్లు మార్క్‌కు రీచ్‌ అయింది. దీంతో ఈమూవీ టీం.. విజయవాడలోని గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ ఈవెంట్‌లోప్రొడ్యూసర్ విశ్వప్రసాద్‌... డైరెక్టర్‌కు సూపర్ గిఫ్ట్ ఇస్తున్నట్టు చెప్పి సర్‌ప్రైజ్‌ చేశాడు.

సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా ‘మిరాయ్’ హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఇదే చేశాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. కాస్ట్‌లీ కార్‌ గిఫ్ట్‌గా ఇస్తానంటూ స్టేజీపైనే ప్రకటించాడు. ‘మిరాయ్’ విషయానికొస్తే.. ‘హనుమాన్’ తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lokesh Kanagaraj: రజినీ – కమల్‌ కూడా పక్కన పెట్టేశారా ?? పాపం..లోకేష్‌!

Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..

Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..

ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!

Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!