మెగా స్టార్‌ టు పవర్‌స్టార్‌.. సమ్మర్ కి సై అంటున్న హీరోలు

Updated on: Nov 07, 2025 | 6:13 PM

2026 వేసవి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా నిలవనుంది. కోవిడ్ తర్వాత కళ తప్పిన వేసవి సీజన్‌ను పునరుజ్జీవింపజేయడానికి మెగాస్టార్, రామ్ చరణ్, నాని, విశ్వక్ సేన్ వంటి అగ్రతారలు తమ చిత్రాలతో సిద్ధమవుతున్నారు. టాక్సిక్, ది ప్యారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు పెద్ద ఎత్తున విడుదల కానున్నాయి.

తెలుగు సినిమాకు వేసవి కాలం అత్యంత కీలకమైన సీజన్‌గా పరిగణించబడుతుంది. గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత, ఈ సీజన్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. అయితే, 2026 వేసవి మాత్రం ప్రీ-కోవిడ్ స్థాయి ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 2026 వేసవి విడుదలకు మొదట ఖర్చీఫ్ వేసిన చిత్రం టాక్సిక్. ఈ చిత్రం నిర్మాణ బృందం విడుదల తేదీ గురించి స్పష్టతనిచ్చింది. ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన చిత్రం వేసవిలో విడుదల కావడం ఖాయమని హామీ ఇచ్చారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం కూడా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు