Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతికి భారీ విజయం సాధించింది. ₹28 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ₹300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. గతంలో ₹200 కోట్ల బడ్జెట్ ప్రచారం జరిగినప్పటికీ, దర్శకుడు అనిల్ రావిపూడి అసలు బడ్జెట్ వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి క్రేజ్, అనిల్ దర్శకత్వ ప్రతిభకు ఇది నిదర్శనం.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు ఈ సంక్రాంతి బరిలో గొప్ప విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను కుమ్మరించింది. నయా ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ బడ్జెట్ ఎంతనేది.. అనిల్ రావిపూడి ఎట్టకేలకు చెప్పడం.. ఆ ఫిగర్ కాస్తా చాలా తక్కువగా ఉండడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. దాంతో పాటే అనిల్ రావిపూడిని మెచ్చుకునేలా చేస్తోంది. మన శంకర వర ప్రసాదు గారు సినిమా మొదలైన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ వరకు ఈ సినిమా మొత్తం బడ్జెట్ 200కోట్లంటూ ప్రచారం జరిగింది. అనిల్ చిరును గ్రాండ్ స్కేల్లో చూపిస్తున్నారని.. అందుకే ఈ రేంజ్ బడ్జెట్ అనే టాక్ వినిపించింది. తీరా కట్ చేస్తే.. అనిల్ నోరు విప్పడంతో ఈ ప్రచారం తప్పనేది తేలిపోయింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరు సినిమాకు జస్ట్ 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు చెప్పడం ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. జస్ట్ 28 కోట్ల ఖర్చుతో.. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం.. అటు చిరు క్రేజ్‌కు.. ఇటు అనిల్ ట్యాలెంట్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌లా మారింది. అనిల్‌కు చిరు పెట్టిన హిట్ మెషీన్ ట్యాగ్ మాత్రమే కాకుండా.. అసాధ్యుడనే ట్యాగ్ లైన్ కూడా కొందరు నెటిజన్ల నుంచి వస్తోంది. అర్థ రూపాయి పెట్టి పది రూపాయలు కలెక్ట్ చేయడం అనిల్‌కే చెల్లుతుందనే కామెంటూ… సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం
TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..
Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు
