Happy Birthday Chiranjeevi: వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే.!
ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్ అంటే మన చిరంజీవి. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు.పట్టుదల,నమ్మకం తో ముందుకు వెళ్ళారు అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ఉండేవారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఫస్ట్ టైం ‘పునాది రాళ్లు’సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’మూవీ ఫస్ట్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్ అంటే మన చిరంజీవి. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు.పట్టుదల,నమ్మకం తో ముందుకు వెళ్ళారు అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ఉండేవారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఫస్ట్ టైం ‘పునాది రాళ్లు’సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’మూవీ ఫస్ట్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్ చేసేవారట. ఒకవేళ చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి ఓ సందర్భంలో అన్నారు. ప్రివ్యూలు చూసి.. రివ్యూలు ఇచ్చి: ఇండస్ట్రీలోకి వెళ్లకముందు చిరంజీవి.. హరిప్రసాద్, సుధాకర్‌లతో మద్రాసులో ఉండేవారు. ‘పూర్ణా పిక్చర్స్’ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్, మేకప్‌మ్యాన్‌లు రావడంతో చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్‌లను లేపి, వారిని కూర్చోబెట్టారట. చేసేదేమీలేక చిరు అండ్ కో నిల్చొనే సినిమాని చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య...