Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్
చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్నారు, తన తండ్రికి ఓ ఇండస్ట్రీ హిట్ అందించారు. దీంతో అందరూ మెగా డాటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. తన అక్కకు దిష్టి తగులుతుందనే ప్రేమతో రామ్ చరణ్ 'ఈవిల్ ఐ' లాకెట్ చైన్‌ను బహుమతిగా ఇచ్చారు. సుస్మిత స్వయంగా ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పటికే చిరు తనయుడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి యాక్టింగ్ లెగసీని పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఇక చరణ్ తర్వాత చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా ప్రొడ్యూసర్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకున్నారిప్పుడు. తన తండ్రిని గర్వపడేలా చేయడంతో పాటు తన తండ్రికే.. మరిచిపోని విధంగా ఇండస్ట్రీ హిట్ సినిమాను ఇచ్చారు. దీంతో ఇప్పుడందరూ మెగా డాటర్ సుస్మిత గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇది గమనించాడో ఏమో కానీ.. చరణ్, తన అక్కకు దిష్టి తగలకుండా ‘ఈవిల్ ఐ’ లాకెట్ చైన్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ‘నీకు దిష్టి తగులుతుందక్కా.. ఈ లాకెట్ వేసుకో’ అంటూ ఆప్యాయంగా చెప్పాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా సుస్మితనే తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
