Meena: భర్త మరణంపై తొలిసారి స్పందించిన మీనా.. ఎమోషనల్ లేఖ విడుదల.. ఏమన్నారు అంటే..?
నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో విద్యాసాగర్ జూన్ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు.
నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో విద్యాసాగర్ జూన్ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. అయితే విద్యాసాగర్ మరణానికి కారణం పావురాలు అంటూ ఇటీవల వార్తలు పెద్ద ఎత్తున సర్కులేట్ అయ్యాయి. పావురాల విసర్జితాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా మీనా రెస్పాండ్ అయ్యారు. ఇకపై ఇలాంటి వార్తలను సర్కులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్ చేశారు.
‘‘భర్త శాశ్వతంగా దూరమవ్వడంతో నేను ఎంతో వేదనలో ఉన్నా. దయ చేసి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు సర్కులేట్ చేయొద్దని మీడియాను వేడుకుంటున్నా. ఈ బాధాకర సమయంలో మాకు తోడుగా నిలిచినవారికి.. సాయంగా నిలబడ్డవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా భర్త ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించిన మెడికల్ టీమ్‌కు, తమిళనాడు సీఎం, హెల్త్ మినిస్టర్, ఐఏఎస్ రాధాకృష్ణన్, మా ఫ్రెండ్స్, మీడియాకు థ్యాంక్స్. నా భర్త త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేసిన అభిమానుల ప్రేమకు ఏమిచ్చినా తక్కువే’
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?