బాస్ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలయికలో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం నుండి విడుదలైన 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట సంక్రాంతి సందడిని ముందుగానే తెచ్చి, తెలుగు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ, చిరు-వెంకీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే.. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుంచి ఎన్నో అంచనాల మధ్య బాస్ – వెంకీ మాస్ మసాలా సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. సంక్రాంతి సందడిని కాస్త ముందుగానే సోషల్ మీడియాకు తీసుకొచ్చింది. అందర్లో జోష్ నింపేస్తూ.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో ట్రెండ్ అవుతోంది. చిరు నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇదివరకు విడుదలైన మీసాల పిల్ల సాంగ్ సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క పాటతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్ అనిల్. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్ అయింది. దిమ్మతిరిగే రెస్పాన్స్ తో ఇప్పుడా సాంగ్ దూసుకుపోతోంది. చిరు, వెంకీ కాంబోలో రూపొందించిన మాస్ సాంగ్ ఇది. సిసిరోలియో సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ పబ్ సెట్టింగ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మాస్ స్టెప్పులు అదరగొట్టారు. ఇద్దరూ కలిసి ఫుల్ ఎనర్జిటిక్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ స్క్రీన్ షేక్ చేశారు. అలాగే తమ అభిమానులను విజువల్ ట్రీట్ అందించారు. మొదటిసారి బాసు, వెంకీ కలిసి కనిపించడంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట
Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్ సినిమా.. హిట్టా..? ఫట్టా..?
Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే
iBOMMA Ravi: పోలీస్ మార్క్ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి
Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ
