Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, సినిమా విడుదలకి 90 రోజుల ముందే ధరల పెంపు నిర్ణయం తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత అప్పీల్ చేయగా, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. ఇది సినీ పరిశ్రమపై పెద్ద ప్రభావం చూపుతుంది.
రీసెంట్‌గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలోనే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా.. తాజాగా ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు షాకింగ్ తీర్పు నిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్‌లో విచారణ ముగించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
