మమిత – క్రికెటర్‌ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??

Updated on: Oct 17, 2025 | 4:32 PM

మమిత...! ప్రేమలు సినిమాతో తెలుగు టూ స్టేట్స్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రదీప్‌ రంగనాథ్‌ డ్యూడ్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఈవెంట్లో తన ప్రజెన్స్‌తో.. నవ్వుతో.. మాటలతో సెంట్రాక్ట్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఈవెంట్‌లోని తన క్యూట్‌ వీడియోలతో ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

అయితే ఇలా వైరల్ అవుతున్న ఈ బ్యూటీని… కొంత మంది ట్రోలర్స్‌ ఇండియన్ క్రికెటర్ శుభ్‌ మన్‌ గిల్‌తో లింక్‌ పెట్టేసి… సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. AI సాయంతో… అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు AIతో వెకిలి చేష్టలు చేస్తున్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చూస్తున్నారు. అలా కొంత మంది నెటిజన్లు మమితా బైబు ఫోటోను… Ai ఫేస్ స్వాప్ ని ఉపయోగించి శుభ్‌మన్‌ గిల్‌గా మార్చారు. దాన్ని మీమ్ గా నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన నెటిజన్లు.. మమిత, గిల్ అభిమానులు షాకవుతున్నారు. ఇలా లింక్ పెట్టారేంట్రా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే కొంత మంది నవ్వించేందుకు చేసిన ఈ మీమ్‌ను మెచ్చుకుంటుండగా.. మరి కొంత మంది సీరియస్ అవుతున్నారు. మమితాను కించపరిచేలా ఈ ప్రయత్నం ఉందంటూ క్రియేటర్స్‌ను తప్పుబడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి

Mithra Mandali: చాలా కష్టపడి నవ్వాలి! హిట్టా..? ఫట్టా..?

ఏదేమైనా రచ్చ గెలవాల్సిందే .. దిల్ రాజు మాస్టర్ ప్లాన్

అది నా తప్పే.. జగ్గూభాయ్‌కి సారీ చెప్పిన కీర్తి