నటిని హోటల్‌కు రమ్మన్న MLA.. దెబ్బకు పదవి, పరువు పాయే..!

Updated on: Aug 23, 2025 | 12:09 PM

మలయాళం సినీ ఇండస్ట్రీలో నటికి లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనను వేధించినట్టు సంచలన ఆరోపణలు చేశారు నటి రిని జార్జ్‌. హోటల్‌కు రావాలని మెసేజ్‌ పంపించారని మాజీ జర్నలిస్ట్, మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఆరోపించారు. తరచుగా తనను వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.

తన లాగే ఇతరులకు ఇలాంటి సమస్య రావద్దన్న ఉద్దేశ్యంతో బయటకు వచ్చినట్టు రిని జార్జ్‌ తెలిపారు. ఈ సంఘటన దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిందని రిని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కొచ్చిలో మీడియాతో మాట్లాడిన ఈమె.. ఆ రాజకీయ నాయకుడి పేరు మాత్రం రివీల్ చేయలేదు.. కానీ ఆ వ్యక్తి వక్ర బుద్దిని బటయపెట్టారు. తన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా సదరు నాయకుడు పట్టించుకోలేదని చెప్పారు.. ఇంకా చాలా మంది మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నారు. అయితే ఈమె ఆరోపణల తర్వాత.. బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. నటి రిని జార్జ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కుతాతిల్‌ వేధించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపణలు షురూ చేశారు. అంతేకాదు కొచ్చిలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు రాహుల్‌ మమ్కుతాతిల్‌. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు. రాహుల్‌ మమ్కుతాతిల్‌ కేరళ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం తరువాత యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరు బర్త్‌డే వేళ.. చరణ్ ఎమోషనల్ మెసేజ్‌

టీజర్‌ను చూసి కన్ఫూజన్‌లో ఫ్యాన్స్?

మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!

NTR సినిమా 15కోట్ల సెట్టా.. ఆ పైసలతో ఇంకో సినిమానే చేసేయొచ్చుగా…

‘నా అన్న ధ్రువతార, పితృసమానుడు’ పవన్‌ ఎమోషనల్ ట్వీట్