Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మోసాలు కూడా భారీగానే పెరిగాయి. కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఖాతాలను ఓపెన్ చేసి జనాలను మోసగిస్తున్నారు. ఫేక్ విషయాలను షేర్ చేస్తూ అటు సెలబ్రిటీలను, ఇటు అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోని ఫేక్ ఖాతాలపై సితార స్పందించారు.
తన పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ ఖాతా గురించి అభిమానులకు హెచ్చరిక చేశారు. తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార తీవ్రంగా స్పందించారు. తన శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు.. ఇలాంటి ఫేక్ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటన విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తప్ప తనకు మరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ లేదని ఆమె స్పష్టం చేశారు. దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “నా పేరు మీద పలు నకిలీ, స్పామ్ ఖాతాలున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పేది ఒక్కటే. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే యాక్టివ్‌గా ఉంటాను. మరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ నేను లేను. దయచేసి నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలతో జాగ్రత్తగా ఉండండి” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంతో చురుగ్గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అప్‌డేట్స్, వివిధ బ్రాండ్స్‌తో తన కొలాబరేషన్స్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటారు. తండ్రి మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘పెన్నీ’ పాట ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!
Samantha: పిచ్చెక్కించిన సమంత ‘కానీ ఇంత ఓవర్ అవసరమా..’ అన్నదే టాక్
Mokshagna: మోక్షు ఎంట్రీపై సస్పెన్స్ పోయినట్టే ఇక!
Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…