‘మిస్‌ అవుతున్నా నాన్నా..’ గౌతమ్‌ బర్త్‌ డే వేళ మహేష్ ఎమోషనల్

Updated on: Sep 01, 2025 | 5:13 PM

ఆగస్టు 31 .. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు నేడు. దీంతో సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు, నెటిజన్ల గౌతమ్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ తన నాన్న మ‌హేశ్ బాబు ఎమోషనల్ అయ్యాడు.

ఫస్ట్ టైమ్.. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చిన మహేష్… తన కొడుకు ప్రతి అడుగులో తన ప్రేమ ఉంటుందని గౌతమ్ పై ప్రేమ కురిపించాడు. ఇంతకీ మహేష్ తన ట్వీట్లో ఏం రాసుకొచ్చారంటే.. “19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్… ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు” అంటూ తన కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మహేష్. ఈ పోస్ట్ కు గౌతమ్ తో కలిసున్న ఒక త్రో బ్యాక్ ఫొటోను జత చేశాడీ సూపర్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు

Published on: Sep 01, 2025 05:13 PM