Mahesh Babu: మహేష్‌కే ఎందుకిలా అవుతోంది..? సర్కారు డేట్‌లోనూ.. పాన్ వరల్డ్ సినిమానా..!

|

Apr 17, 2022 | 9:57 AM

అదేంటో మహేష్ కే ఇలా అవుతోంది. హాలీవుడ్‌ సినిమాలు అందులోనూ మార్వెల్ సినిమాల పోటు మహేష్కే ఎక్కువుంటోంది. అప్పుడెప్పుడో 2018 ఏప్రిల్‌లో రిలీజైన భరత్ అనేనేను.. ఓవర్సీస్‌లో 4 మిలియన్ల మార్క్‌ని కూడా చేరుకోలేదు. కారణమేంటంటే..


అదేంటో మహేష్ కే ఇలా అవుతోంది. హాలీవుడ్‌ సినిమాలు అందులోనూ మార్వెల్ సినిమాల పోటు మహేష్కే ఎక్కువుంటోంది. అప్పుడెప్పుడో 2018 ఏప్రిల్‌లో రిలీజైన భరత్ అనేనేను.. ఓవర్సీస్‌లో 4 మిలియన్ల మార్క్‌ని కూడా చేరుకోలేదు. కారణమేంటంటే.. అదే టైమ్‌లో వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్-ఇన్‌ఫినిటీ వార్’. తర్వాత 2019 సమ్మర్‌లో రిలీజైన మహర్షి సినిమాక్కూడా సరిగ్గా ఇటువంటిదే మరో ఛాలెంజ్‌ తగిలింది. ‘ఎవెంజర్స్- ఎండ్‌గేమ్’.. లోకల్‌లోనూ, ఓవర్సీస్‌లోనూ మహర్షి వసూళ్లను గట్టిగానే టార్గెట్ చేసింది ఆ మూవీ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి.. సర్కారువారి పాట వంతొచ్చింది. ట్రిపులార్‌నీ, ఆచార్యను ఇంటిలిజెంట్‌గా తప్పించుకుని.. మే12వ తారీఖ్‌ని రౌండప్ చేసుకున్నా.. అక్కడా హాలీవుడ్ నుంచి షాక్ ట్రీట్‌మెంట్ తప్పేలా లేదు సూపర్‌స్టార్ మూవీకి. ‘డాక్టర్ స్ట్రేంజ్‌- మల్టివర్స్ ఆఫ్ మాడ్‌నెస్’ ఇదే సమ్మర్‌లో అదే గ్యాప్‌లో వచ్చేస్తోంది ఈ చిత్రం. విచిత్రం ఏంటంటే.. డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో సూపర్‌స్టార్‌ని టార్గెట్ చేస్తున్న ఈ మూడు సినిమాలూ మార్వెల్ మూవీస్ బేనర్‌వే. ఈసారైనా.. హాలీవుడ్‌ థ్రెట్‌ని తట్టుకుని.. సూపర్‌స్టార్ తన జైత్రయాత్రను కంటిన్యూ చేస్తారేమో చూడాలి మరి. అభిమానులు మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డులను రీచ్ అవుతుంది అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..