బాబుది సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. కొనాలంటే మన నెల జీతం కూడా సరిపోదు

Updated on: Jun 10, 2025 | 4:54 PM

స్టార్ హీరోలు, క్రికెటర్లు ధరించే చొక్కాలు, ప్యాంటు, బ్యాగులు, చెప్పుల ధరల గురించి తరచు చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు బహిరంగంగా కనిపించినప్పుడు వారు ధరించే దుస్తుల ధరల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ పై కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది.

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లిపీటలెక్కాడు. జైనాబ్‌ రవ్జీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. జూన్ 8 హైదరాబాద్‌లోని అక్కినేని స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అక్కినేని అఖిల్ వివాహం జరిగింది. దీంతో నాగార్జున ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. అందుకు తగ్గట్టుగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అఖిల్-జైనాబ్ ల రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార రిసెప్షన్ కు వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా టీ షర్ట్ సింపుల్ గా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ ‘హెర్మ్స్’ నుండి వచ్చిన టీ-షర్ట్. దీని ధర సుమారు 1.51 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ టీషర్ట్ ధరతో ఒక లగ్జరీ బైక్ కొనుగోలు చేయవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేను చేసిన ఎదవ పనికి.. పాపం.. NTR గుక్కపెట్టి ఏడ్చాడు!

ఒకప్పుడు వైజాగ్‌లో అరటి పండ్లు అమ్మాడు.. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం

సమస్యే లేదు.. ఆమె లేనిది సినిమానే లేదు

‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్‌ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది

నోటి దురుసు.. స్టార్ సింగర్‌ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?