Mahesh Babu: నాపై చాలా ఒత్తిడి ఉంది.! సినిమాల గురించి మహేష్ ఎమోషనల్ కామెంట్..

|

Oct 19, 2023 | 10:58 AM

ఎవరికైనా.. తండ్రే రియల్ హీరో..! ఎందుకంటే.. ఎలా ఉండాలో.. ఎలా నడుచుకోవాలో.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో.. సమాజంలో ఎలా బతకాలో.. అన్నీ నేర్పేది నాన్నే! అందుకే ఆయనే కనిపించే దేవుడంతే..! ఇది ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యారు కనుకే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా... తన తండ్రి నేర్పిన పాఠాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ అవుతారు. ఇక తాజాగా మరోసారి ఇలాగే చేశారు.

ఎవరికైనా.. తండ్రే రియల్ హీరో..! ఎందుకంటే.. ఎలా ఉండాలో.. ఎలా నడుచుకోవాలో.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో.. సమాజంలో ఎలా బతకాలో.. అన్నీ నేర్పేది నాన్నే! అందుకే ఆయనే కనిపించే దేవుడంతే..! ఇది ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యారు కనుకే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా.. తన తండ్రి నేర్పిన పాఠాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ అవుతారు. ఇక తాజాగా మరోసారి ఇలాగే చేశారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్.. ఓ సినిమా హిట్టు ప్లాపు గురించి.. హీరో అనుభవించే ఒత్తిడి గురించి.. ఓ ఇంటర్వ్యూలో కాస్త ఎమోషనల్గా చెప్పారు. “నేను నటించిన సినిమాలు ఫ్యాన్స్‌ను ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనప్పుడు.. కాస్త డిస్సపాయింట్ అవుతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌, దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ ఫోకస్ పెడతాను. మనం స్టార్‌ హీరో అయినప్పుడు స్ట్రెస్‌ను అంగీకరించాలి. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన నాకు చెప్పేవారు”. విజయం అనేది ఒక్కసారిగా రాదని దాని వెనుక స్ట్రగుల్ ఉంటుందని… తన నాన్న కృష్ణను గుర్తు చేసుకుంటూ చెప్పారు మహేష్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 19, 2023 10:56 AM