Sitara Ghattamaneni: తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా.! వీడియో
సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియా పుణ్యమాని చిన్నతనం నుంచి తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సితార.. ఓ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇక త్వరలో సినిమాల్లోకి కూడా రానుందని తల్లి నమ్రత ఇప్పటికే ప్రకటించారు. తాజాగా గొప్ప మనస్సు చాటుకున్న ఘట్టమనేని సితార మరిన్ని మార్కులు కొట్టేశారు.
సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియా పుణ్యమాని చిన్నతనం నుంచి తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సితార.. ఓ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇక త్వరలో సినిమాల్లోకి కూడా రానుందని తల్లి నమ్రత ఇప్పటికే ప్రకటించారు. తాజాగా గొప్ప మనస్సు చాటుకున్న ఘట్టమనేని సితార మరిన్ని మార్కులు కొట్టేశారు. పెద్దల పట్ల గౌరవం చూపించే సందర్భాల్లో హోదాలు, అంతస్తులు గుర్తుకురావని సితార నిరూపించారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్.. దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, వారి కూతురు సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు వివిధ బహుమతులు అందించారు. కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి రావడానికి ఓ వృద్ధురాలు ఇబ్బంది పడగా సితార వెంటనే స్పందించింది. స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది. ఈ ఘటనను మహేశ్ అభిమాని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..