SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..

|

Oct 30, 2024 | 10:00 AM

అపజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్‌ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి, ట్రిపులార్‌ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్‌ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్‌ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! SSMB29 సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట రాజమౌళి.

దానికి తగ్గట్టే.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్‌ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు ఓ టాక్ బయటికి వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించనున్నారని.. నెట్టింట మరో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి.. ఏఐలో శిక్షణ కూడా తీసుకుంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on