నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్
తెలుగు దర్శకులలో పూరి జగన్నాథ్ శైలి ప్రత్యేకం. ప్రస్తుతం మాస్ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్న పూరిపై స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పూరి రచనా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, ఆయన హిట్ కొడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని స్టార్ హీరోలు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం స్లమ్ డాగ్ చిత్రంతో బిజీగా ఉన్నారు పూరి.
తెలుగు చిత్రసీమలో ఎంతోమంది దర్శకులున్నా, పూరి జగన్నాథ్ శైలి ప్రత్యేకమైనది. పడటం, లేవడం, పరిగెత్తడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కూడా ఆయన ఒక మాస్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు పూరి జగన్నాథ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నా, ఆయన హిట్ కొడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఆయన అభిమానులు, సినీతారలు సైతం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పూరి జగన్నాథ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పూరి రాసే క్యారెక్టరైజేషన్లు ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఎవరూ రాయలేరని ప్రభాస్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పూరికి వందేనుగుల బలం వచ్చినట్లయ్యింది. గతంలో మహేష్ బాబు సైతం వారణాసి ప్రమోషన్స్ లో పూరి జగన్నాథ్ రైటింగ్ గురించి అంతర్జాతీయ మీడియాకు తెలియజేశారు. పోకిరి చిత్రం తనను స్టార్‌ను చేసిందని, పూరిని ఆకాశానికి ఎత్తేశారు సూపర్ స్టార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
ఇరాన్‌పై దాడులకుమా బేస్ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే
రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు