‘మహావతార్ నరసింహ’ పై సంచలన ఆరోపణలు!

Updated on: Jan 30, 2026 | 8:50 AM

గత సంవత్సరం విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, ఆస్కార్ పరిశీలనలోకి వచ్చింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలు, వీడియో గేమ్‌ల నుండి కాపీ చేయబడ్డాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

గత సంవత్సరం విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి యానిమేషన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. క్లీన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ సారథ్యంలో అశ్విన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా, ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిల్మ్స్ దీనిని డిస్ట్రిబ్యూట్ చేసింది. మహావతార్ నరసింహ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో, కేవలం రూ. 15 కోట్లతో నిర్మించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు, 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో యానిమేషన్ కేటగిరిలో ఈ మూవీకి స్థానం దక్కింది.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌