Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!

Updated on: Oct 23, 2024 | 1:52 PM

ట్రిపులార్‌తో ఒక్కసారిగా గ్లోబల్‌ హీరోగా పేరు సంపాదించుకున్న మెగా హీరో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఎంతో గర్వంగా భావించే ఈ విగ్రహాల జాబితాలో చెర్రీ కూడా చేరడం విశేషం. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.

భారతదేశానికి చెందిన ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌ మైనపు విగ్రహం కూడా సూపర్ ఫాస్ట్‌ గా రెడీ అవుతోంది. వచ్చే వేసవి నాటికి సింగపూర్ మ్యూజియంలో కొలువుదీరనుంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌తోపాటు ఆయన పెట్‌ డాగ్‌ రైమ్‌లకు సంబంధించిన కొలతలను, ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చెర్రీ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ అప్డేట్ ఇచ్చారు. రామ్‌ చరణ్‌ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??

రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!

Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??

TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ

Published on: Oct 23, 2024 01:50 PM
Loading...
Unable to load recommendations.
Follow Us