Lokesh Kanagaraj: హీరోగా మారిన ప్యాన్ ఇండియా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

Edited By:

Updated on: May 18, 2026 | 6:42 PM

LCUతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ‘DC’ సినిమాతో హీరోగా మారుతున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వైలెంట్ లవ్ స్టోరీ ట్రైలర్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. రౌడీ, వేశ్య పాత్రల నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం లోకేష్ పూర్తిగా మేకోవర్ అవ్వగా, అనిరుధ్ సంగీతం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.

లోకేష్ కనకరాజ్ ప్లాన్ ఏంటి..? ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఉన్న ఈయన.. ఉన్నట్లుండి హీరోగా ఎందుకు మారుతున్నారు..? తొలి సినిమా DC ఎలా ఉండబోతుంది..? రౌడీ, వేశ్య బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ వైలెంట్ లవ్ స్టోరీలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఏం చూపించబోతున్నారు..? లోకేష్ లాంటి స్టార్ డైరెక్టర్ యాక్ట్ చేసిన ఈ ట్రైలర్ ఎలా ఉంది..? LCU అంటూ మల్టీవర్స్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సడన్‌గా హీరో అయిపోయారు. కూలీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు లోకేష్. నెక్ట్స్ అల్లు అర్జున్‌తో భారీ సినిమాకు సిద్ధమవుతూనే.. DC అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాని కాయితం, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. డిసి సినిమాతో లోకేష్ కనకరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.. ఈ సినిమా కోసం లోకేష్ కూడా చాలా మేకోవర్ అయ్యారు. అనుకోకుండా వేశ్యగా మారిన హీరోయిన్.. రౌడీ అయిన హీరో.. ఈ ఇద్దరి ప్రయాణమే DC కథ. సన్ పిక్చర్స్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తుంది. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ట్రైలర్ రేంజ్ పెంచేసింది. కథ పాతదే అయినా నెరేషన్ కొత్తగా కనిపిస్తుంది.. ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tamannaah Bhatia: ప్రేమకు కొత్త అర్థం చెప్పిన తమన్నా.. మిల్కీ బ్యూటీ కొత్త ఫిలాసఫీ వైరల్

ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్

Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే

సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం

కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??

Loading...
Unable to load recommendations.
Follow Us