ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ ‘ అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీని ఒక్కసారి షేక్ చేశాడు. ఎంతలా అంటే విజయ్ పేరు బాలీవుడ్ వరకు వినిపించేంతేలా.
పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ ‘ అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీని ఒక్కసారి షేక్ చేశాడు. ఎంతలా అంటే విజయ్ పేరు బాలీవుడ్ వరకు వినిపించేంతేలా. తాజాగా ‘లైగర్’తో తొలిసారి హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. సినిమా చూసినవారంతా వన్ మ్యాన్ షో అంటూ విజయ్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీవీ9 MD, CEO బరున్ దాస్‌తో విజయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన కెరీర్, బాలీవుడ్ ఎంట్రీ, లైగర్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ఫోకస్ ప్రత్యేకంగా బాలీవుడ్‌పై లేదని తెలిపిన విజయ్.. ప్రేక్షకులకు కథ చెప్పడమే తొలి ప్రాధాన్యత అని వివరించాడు. ఇండస్ట్రీ కంటే తనకు ఇండియా ముఖ్యమన్న విజయ్.. మనం చెప్పే కథను దేశం మొత్తానికి చెప్పాలని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలపై కూడా రౌడీ హీరో స్పందించారు. తెలుగు సినిమా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. బాహుబలి చిత్రం వేసిన బాటలోనే లైగర్ కూడా నడుస్తోంది అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: మొన్న జూ.ఎన్టీఆర్…నేడు నితిన్..తారలతో భేటీ దేనికి సంకేతం ??