Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!

Updated on: Sep 18, 2025 | 1:06 PM

కత్రినా కైఫ్‌! పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో.. స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. హిందీలో ఎక్కువగా సినిమాల్లో నటించి కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ ట్యాలెంటెడ్ హీరోను పెళ్లి చేసుకుని.. సినిమాలు తగ్గించేసింది. హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

ఈ క్రమంలోనే కత్రినా తల్లి కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అలియా, దీపికా పదుకొణే, కియారా అద్వానీ, మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. వీరి లాగే కత్రినా కూడా తొందర్లో మాతృత్వాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించనున్నారని ఆమె నియార్ డియర్స్ చెబుతున్నారు. కొంతకాలం క్రితం కత్రీనా విమానాశ్రయంలో కనిపించింది. ఆ సమయంలో ఆమె లుక్ చూసి త్వరలోనే తల్లి కాబోతుందంటూ రూమర్స్ వినిపించాయి. కొన్నాళ్లుగా కత్రీనా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ విక్కీ కౌశల్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. అంతేకాదు అటు సోషల్ మీడియాలోనూ కత్రీనా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ అనే ప్రచారం బాలీవుడ్‌లో మొదలైంది. ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్‌లో వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే.. వారిద్దరూ నోరు విప్పే వరకు వెయిట్ చేయాల్సిందే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్‌ ఓవర్ యాక్షన్

Vande Bharat: నరసాపురానికి తొలి వందే భారత్ రైలు..