Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Updated on: Feb 25, 2026 | 5:56 PM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రానున్న ఖైదీ 2 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన టీజర్‌కు యూ సర్టిఫికెట్ జారీ కావడంతో ఎల్సీయూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా తర్వాత ఖైదీ 2 పట్టాలెక్కుతుందని అంచనా వేస్తున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఖైదీ 2 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే, ప్రస్తుతం ఖైదీ 2 టీజర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన ఈ టీజర్‌కు యూ సర్టిఫికెట్ జారీ కావడంతో ఎల్సీయూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీ సినిమా విడుదలైనప్పటి నుంచే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. విక్రమ్ సినిమా కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండటంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. కార్తీ గతంలో లియో తర్వాత ఖైదీ 2 ఉంటుందని చెప్పినప్పటికీ, రజనీకాంత్ తో కూలి, ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టారు లోకేష్. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఖైదీ 2 పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Published on: Feb 25, 2026 05:55 PM
Follow Us