24 ఏళ్ల వైరం ముగిసే వేళ.. ధనుష్ సినిమా కోసం కరీనా, భన్సాలీ ఒక్కటవుతున్నారా?
బాలీవుడ్‌లో 24 ఏళ్లుగా కొనసాగుతున్న కరీనా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ కోల్డ్‌వార్‌కు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. ధనుష్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ జంగిల్ అడ్వెంచర్ కోసం కరీనాను హీరోయిన్‌గా సంప్రదించినట్లు సమాచారం. ‘దేవదాసు’లో పారో పాత్ర విషయంలో మొదలైన విభేదాల తర్వాత భన్సాలీతో పనిచేయనని చెప్పిన కరీనా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2027లో షూటింగ్ ప్రారంభం కానుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఓ కోల్డ్ వార్ ఇప్పుడు ఎండ్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మారిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ.. ఇప్పుడు కలిసి పని చేసేందుకు రెడీ అవుతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్ స్టోరి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవదాసు’ మూవీ విషయంలో ఈ వివాదం మొదలైంది. ఆ సినిమాలో పారు పాత్ర కోసం ఫస్ట్ కరీనా కపూర్‌కు స్క్రీన్ టెస్ట్ చేశారు భన్సాలీ. కానీ లాస్ట్ మినిట్‌లో ఆమెను కాదని ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవడంతో కరీనా హర్ట్ అయ్యారు. భవిష్యత్తులో భన్సాలీతో కలిసి పనిచేయను అంటూ పబ్లిక్‌గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మొదలైన ఆ కోల్డ్ వార్ 24 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇన్నాళ్లకు ఆ వివాదానికి తెర పడబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు భన్సాలీ. తమిళ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది. ఏనుగు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అందుకే ఈ రోల్ కోసం కరీనా కపూర్‌ను సంప్రదించారు నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. కరీనా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్, అన్నీ ఓకే అయితే 2027 జనవరిలోసెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి 24 ఏళ్ల సుదీర్ఘ వివాదాన్ని మర్చిపోయి.. ధనుష్ సినిమా కోసం భన్సాలీ, కరీనా చేతులు కలపడం ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా!
Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ ఆ రోజు నుంచి మొదలు..
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!