కామెడీ స్టార్‌ను టార్గెట్ చేసిన మాఫియా గ్యాంగ్.. కాల్పులతో వార్నింగ్
కెనడాలోని సర్రేలో హాస్యనటుడు కపిల్ శర్మ కాఫ్స్ కేఫ్‌పై మరోసారి కాల్పులు జరిగాయి. గోల్డీ థిల్లాన్, కుల్దీప్ సిద్ధూ ఈ దాడికి తాము బాధ్యులమని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. సామాన్యులకు శత్రుత్వం లేదని, చట్టవిరుద్ధ పనులలో పాల్గొనేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇది నెలరోజుల్లో రెండో దాడి.
కెనడాలోని సర్రేలో హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కాఫ్స్ కేఫ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. గోల్డీ థిల్లాన్, కుల్దీప్ సిద్ధూ అనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ, సర్రేలోని కాఫ్స్ కేఫ్‌లో జరిగిన ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తున్నామని ప్రకటించారు. తమకు సాధారణ ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదని, అయితే తమతో విభేదాలు ఉన్నవారు, అలాగే చట్టవిరుద్ధమైన పనులలో పాల్గొనేవారు సిద్ధంగా ఉండాలని వారు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
