కాంతార కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో ఎన్ని వందల రూ.కోట్లు వచ్చాయో తెలుసా ??

Updated on: Oct 07, 2025 | 7:53 PM

భారీ అంచనాల మధ్య విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో విధ్వంసం సృష్టిస్తోంది.

తెలుగులో ఊహించని రేంజ్‌లో వసూళ్లు రాబడుతోంది. ఈ ఫీట్‌తో 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. ఇది రిషబ్ శెట్టి కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టిన కాంతార చాప్టర్ 1, ప్రీమియర్స్ తో కలిపి 89 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా సినిమా వసూళ్లు తగ్గకుండా, దాదాపు 43.65 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక మూడు రోజుల్లోనే రూ.235 కోట్ల కలెక్షన్లు సాధించి, రూ.200 క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. తాజాగా 4వ రోజుకు సంబంధించిన కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. నాలుగు రోజుల్లో రూ.335 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కాంతార హవా నడుస్తోంది. రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించిన ఈసినిమాలో సీనియర్ నటుడు జయరాం కూడా కీలక పాత్రలో కనిపించారు. అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం కేవలం కన్నడ వెర్షన్ లో మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వెర్షన్లు కూడా చక్కటి వసూళ్లు సాధిస్తూ సంచనాలు సృష్టిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారులో పెట్రోలు కొట్టిస్తుండగా భగ్గున చెలరేగిన మంటలు

యువతి అనారోగ్యాన్ని మంత్రంతో పోగొడతానన్నాడు.. చివరికి..

ఓరి బుడ్డోడా.. మ్యాగీ కోసం ఎంత పనిచేశాడు

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం

అపర కుబేరుడు.. ఈ ఆటోవాలా.. నెలకు రూ. 3 లక్షల ఆదాయం