Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్
విక్రమ్ విజయం తర్వాత కమల్‌హాసన్ జోరు పెరిగింది. రజనీకాంత్‌తో రెండు 'అన్‌ఎక్స్‌పెక్టెడ్' కథల వేటలో ఆయన ఉన్నారు. ఒకటి రజనీకి నిర్మాతగా, మరొకటి రజనీతో కలిసి నటించే సినిమా కోసం. లోకేష్, సుందర్.సి కథలు నచ్చకపోవడంతో, లోకనాయకుడు స్వయంగా అసాధారణమైన కథల కోసం అన్వేషిస్తున్నారు. ఇది కమల్, రజనీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఎక్స్ పెక్ట్ ది అన్ ఎపెక్టెడ్ అని అంటున్నారు కమల్‌హాసన్. ఇప్పుడు ఆయన ఒకటి కాదు.. ఒకటికి రెండు కథలు వెతుకుతున్నారు. అవి ఎలా ఉండాలి అంటే… ఇలా కూడా ఉంటుందా? అన్నట్టుండాలి. ఇంతకీ ఆ రెండు కథలు ఎవరికి అంటారా? ఒకటి నిర్మాతగా, ఒకటి నటుడిగా.. రెండిటిలోనూ తన ప్రమేయం ఉంటుంది. ఆబ్వియస్లీ రజనీకాంత్ కోసమే కథలన్నమాట. విక్రమ్ సినిమాకి ముందు.. విక్రమ్ సినిమాకి తర్వాత అన్నట్టుగా ఉంది రీసెంట్ టైమ్స్ లో కమల్‌హాసన్ స్పీడు చూస్తుంటే. ఓ వైపు నటుడిగా తన ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తూనే, మరోవైపు నిర్మాతగా రజనీకాంత్ కోసం కూడా స్పెషల్ కథల వేట సాగిస్తున్నారు. నిర్మాతగా హీరోకి నచ్చిన కథ వచ్చే వరకూ వెతకడమే తన పని అని చెప్పేశారు కమల్‌హాసన్. అంతకు ముందు లోకేష్‌గానీ, రీసెంట్‌గా సుందర్.సిగానీ చెప్పిన కథ నచ్చకపోవడంతోనే ప్రాజెక్ట్ ముందుకు సాగలేదన్నది కమల్ మాటల్లో సారాంశం. ఇప్పుడు ఓ కథని రజనీకాంత్‌తో సినిమా చేయడానికి, ఇంకో కథనీ.. తానూ – రజనీ కలిసి సినిమా చేయడానికి వెతుకుతున్నట్టు రివీల్ చేశారు లోకనాయకుడు. ఎలాంటి కథల కోసం వేట సాగుతోందని అడిగితే ఎక్స్ పెక్ట్ ది అన్ ఎక్స్ పెక్టెడ్ అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చేశారు కమల్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్
యానిమేషన్ ప్రధానంగా ప్రభాస్ – ప్రేమ్‌రక్షిత్ సినిమా
హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా