Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా

Updated on: Jan 21, 2026 | 4:49 PM

ఖైదీ 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హీరో కార్తి షాక్ ఇచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ విజయ్, రజినీకాంత్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో వరుసగా కొత్త సినిమాలు ప్రకటించడంతో ఖైదీ 2 భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై ప్రశ్నించగా, కార్తి సమాధానం లోకేష్‌ను అడగాలంటూ మాట దాటవేశారు. దీంతో ఖైదీ 2 కోల్డ్ స్టోరేజ్‌లో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం హీరో కార్తి ఎక్కడ కనిపించినా ఖైదీ 2 సీక్వెల్ గురించే చర్చ జరుగుతోంది. రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కార్తి నుంచి ఖైదీ సీక్వెల్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, కార్తి అభిమానులకు, సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చారు. ఖైదీ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత విక్రమ్ సినిమా కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండటంతో ఖైదీ 2 పై హైప్ మరింత పెరిగింది. గతంలో, విజయ్‌తో లియో సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 షూటింగ్ ప్రారంభిస్తారని కార్తి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhanush: మరో వివాదంలో ధనుష్‌.. ఆ సినిమా పై కేసు

తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా

Allari Naresh: హీరో నరేష్‌ ఇంట తీవ్ర విషాదం

హృదయవిదారకం.. ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?

వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర