పవన్, చరణ్ ను.. ఎన్టీఆర్ ఫాలో అవ్వాల్సిందే

Updated on: Apr 18, 2025 | 1:34 PM

ఇప్పుడు మన స్టార్ హీరోలకు ఫ్యాన్స్‌తో పెద్ద చిక్కొచ్చి పడింది. వారి వారి బర్త్‌డేలొస్తే చాలు.. భయపడి ఉలిక్కిపడి.. తలపట్టుకోవాల్సిన పరిస్థితి మన హీరోలకు వచ్చింది. మే20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌ డే కావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్‌కు కూడా అదే పరిస్థితి వచ్చేలా ఉంది. దీంతో తారక్ తప్పక మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి.

మన స్టార్ హీరో బర్త్‌ డే వచ్చిందంటే చాలు.. ఫ్యాన్స్ నుంచి ఒకటే డిమాండ్.. తమ కొత్త సినిమా లుక్కో.. లేద వీడియో గ్లింప్సో రిలీజ్‌ చేయమని! ఇంకోమాటలో చెప్పాలంటే డిమాండ్ మాత్రమే కాదు.. రుబాబ్‌! ఫ్యాన్స్‌ కదా.. వారి లవబుల్ రుబాబ్‌కు హీరోలు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి. ఇక గతంలో రామ్ చరణ్‌, అండ్ పవన్‌ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తలొగ్గారు. తమ కొత్త సినిమాల షూటింగ్ మొదలెట్టి కొన్ని రోజులే అయినా కూడా.. ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే వీడియో గ్లింప్స్‌ను వదిలారు. అప్పట్లో పవన్‌ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నట్టు తన బర్త్‌ డేకు కొన్ని రోజుల ముందే అనౌన్స్ చేశాడు. అంతే బర్త్‌ డే నాటికి ఈ సినిమా నుంచి గ్లింప్స్ కావాలని ఫ్యాన్స్‌ ఒత్తిడి చేశారు. దీంతో చేసింది తక్కు షూటింగ్‌ అయినా..అందులోంచి వారికి పుల్ మీల్ పెట్టినంత కంటెంట్ వదిలాడు పవర్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగ వర్గాలకు గుడ్‌ న్యూస్‌.. ఫేస్‌ అథంటికేషన్‌ వచ్చేసిందోచ్‌

Odela 2: శివశక్తిగా తమన్నా మేజిక్‌ చేసిందా.. ఓదెల 2 ఎలా ఉందంటే ??

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి.. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు.. ఏం జరిగిందంటే..

దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను

పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి

Published on: Apr 18, 2025 12:50 PM