War 2 Pre Release Event Live : ఎన్టీఆర్, హృతిక్ రోషన్‏ల వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్.. తరలివచ్చిన ఫ్యాన్స్..

Updated on: Aug 10, 2025 | 7:06 PM

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, బీటౌన్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కీలకపాత్రలు పోషించారు. అలాగే హృతిక్ జోడిగా కియారా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకను ప్రత్యేక్ష ప్రసారంలో చూడండి.