శ్రీతేజ్ కుటుంబానికి జానీ మాస్టర్ భరోసా
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. డిసెంబర్ 25న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పారు. డ్యాన్సర్స్ యూనియన్ తరఫున సాయం చేస్తామని శ్రీ తేజ్ ఫ్యామీలీకి భరోసా ఇచ్చారు.
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోందని.. అతడు త్వరితగతిన కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని చెప్పారు జానీ మాస్టర్. అంతేకాదు భాస్కర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాం అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందికి శ్రీతేజ్‌ను చూడాలని, వచ్చి పలకరించాలని ఉంటుందని.. కాకపోతే కొన్ని పరిధుల వల్ల అందరికీ ఇక్కడకు రావడం కుదరడం లేదని చెప్పారు జానీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
ఒక్క గంటలో శ్రీవారి దర్శనం.. ఏఐ టెక్నాలజీతో ఎంతవరకు సాధ్యం ??
దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా
క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. బిర్యానీ తింటుండగా..