నా గొంతు మోగబోయింది.. తల్లి శ్రీదేవి కోసం జాన్వి హృద్యమైన కవిత వీడియో
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్, ఓ టాక్ షోలో తన తల్లిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవిపై స్వయంగా రాసిన కవితను చదివి అందరినీ కదిలించారు. "టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్" షోలో ఆమె తన తల్లి జ్ఞాపకాలను పంచుకున్నారు.
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఓ టాక్ షోలో తన తల్లిపై స్వయంగా రాసుకున్న ఒక కవితను ఆమె చదివి వినిపించారు, అందరినీ కదిలించారు. ఈ ఘటనతో ఆమె తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నారో మరోసారి స్పష్టమైంది. నటులు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ హోస్టులుగా వ్యవహరిస్తున్న “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” అనే కార్యక్రమానికి జాన్వి కపూర్, కరణ్ జోహార్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లిని ఉద్దేశించి రాసిన కవితను చదివారు. “నేనొక చిన్న పిల్లని. కానీ, అకస్మాత్తుగా ఆ హక్కును కోల్పోయాను. ఎవరి ప్రేమ కోరుకున్నానో వారికే దూరమయ్యాను. నా సొంత గొంతును కోల్పోయి ఇప్పుడు అమ్మ గొంతుతో మాట్లాడుతున్నాను. ఈ రూపంలోనే ఆమెను నా దగ్గర ఉంచుకుంటున్నాను” అంటూ జాన్వి భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
