ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
ఈమధ్య స్టార్ హీరోల టికెట్స్ రేట్స్ చూస్తే గుండె బరువెక్కేంత పనైపోతుంది. అలాంటి ఈ పరిస్థితుల్లో.. చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న కేసీఆర్ సినిమా టీం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సినిమాలో నటించి ప్రొడ్యూస్ చేసిన రాకింగ్ రాకేష్.. తన సినిమా టికెట్ భారీగా తగ్గించడం ఇప్పుడు ఫిల్మ్ లవర్స్‌ను కాస్త సంతోషపెడుతోంది.
ఎస్ ! రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ లీడ్‌లో తెరకెక్కిన కేశవ చంద్ర రమావత్ సినిమా నవంబర్ 22న రిలీజ్ అయింది. దీంతో తన సినిమా గురించి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాకేష్.. ఆడియెన్స్ కు తమ సినిమా రీచ్ కావాలనే ఉద్దేశంతో టికెట్ రేట్స్ భారీగా తగ్గించామంటూ చెప్పాడు. ఒక్కో టికెట్ వందరూపాయిలకు మించి లేదన్నాడు. ఇక సంధ్యా లాంటి థియేటర్స్ లో టికెట్ 80, 50 రూపాయలకే దొరుకుతుందంటూ చెప్పాడు. ఇక తన సినిమా టికెట్ రేట్స్‌ను భారీగా తగ్గించి.. సినిమాను కామన్ ఆడియెన్స్‌ను దగ్గర చేసే ప్రయత్నం చేసిన రాకింగ్ రాకేష్‌ను నెట్టింట చాలా మంది అభినందిస్తూ కామెంట్స్ పెడుతన్నారు. ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ జబర్దస్త్ కమెడిన్ చేసిన ఈ ప్రయత్నం .. తన సినిమాను ఏ రేంజ్లో నిలబెడుతుందో చూడాలి మరి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్
Renu Desai: రేణు ఇంట తీవ్ర విషాదం !! దుఃఖంలో అకీరా తల్లి
పెళ్లి కొడుకు రాలేదని.. ఆగిపోయిన రైలు