Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

Updated on: Apr 22, 2025 | 3:39 PM

టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో.. అప్పుడప్పుడూ సినిమాలో బిజి బిజీగా ఉండే రష్మీ.. ఈ మధ్యన తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన భుజం గాయంతో ఆస్పత్రి పాలైన రష్మీ అందుకు సర్జరీ కూడా చేయించుకున్నారు. తాజాగా మరోసారి అనారోగ్యంలైన రష్మీ అసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

అలాగే తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేసి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈమె. గత కొన్ని రోజులుగా తన హెల్త్ ఏమీ బాగుండడం లేదంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చిన రష్మీ.. జనవరి నుంచి తనకు కంటిన్యూగా రక్తస్రావం అవుతుందన్నారు. భుజాలు కూడా చాలా నొప్పిగా ఉన్నాయని.. ఆ బాధను తాను భరించలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలో తనకు అర్థం కాలేదని.. కానీ తాను ఎలాగోలా మార్చి 29 వరకు మ్యానేజ్ చేశానన్నారు. అప్పటికీ తన వల్ల కాకపోవడంతో.. త్వరగా తన కమిట్మెంట్స్‌ను పూర్తి చేసి.. ఆసుపత్రిలో జాయిన్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు రష్మీ. అంతేకాదు ఉన్నట్లుండి విపరీతంగా రక్త స్రావం, ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయని.. చివరకు తన హీమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయిందని.. రష్మీ తన పోస్టులో వివరించారు. ఏం జరుగుతోందో అర్థం కాక వెంటనే హాస్పిటల్‌లో చేరా అన్నారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయిందని.. ఇప్పుడు క్షేమంగానే ఉన్నానంటూ తన పోస్ట్‌లో మెన్షన్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..