సడన్ గా వెలుగులోకి వచ్చిన హీరోయిన్లు
ఒక్క పర్ఫెక్ట్ సినిమా చాలు హీరోయిన్ల ఫేట్ మారిపోవడానికి. ఆ తర్వాత కెరీర్‌లో నిలదొక్కుకునేదీ లేనిదీ వారు ప్రాజెక్టులను సెలక్ట్ చేసుకునే తీరు, కష్టపడే విధానం, యాటిట్యూడ్, లక్.. ఇన్నిటిమీదా బేస్ అయి ఉంటుందన్నది ఫ్యాక్ట్. అలా సడన్‌గా రెయిజ్ అయిన హీరోయిన్లు ఎవరు? ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో అని ప్రగ్యాజైశ్వాల్ అంటే... ఇంత రాయల్‌గా ఉందేంటీ అమ్మాయి అని అందరూ ఫిదా అయ్యారు.
ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి ఈ లేడీకి. సక్సెస్ ఫెయిల్యూర్స్ మీద మిగిలిన కెరీర్ నడిచింది. ప్రగ్యా తర్వాత ఆ రేంజ్‌లో అట్రాక్ట్ చేశారు మృణాల్ ఠాకూర్. ప్రిన్సెస్ నూర్జహాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు మృణాల్ ఠాకూర్. సప్తసాగరాలు దాటి సినిమాతో మెప్పించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్ చాలా మందికి. కాంతరలోనూ ఆమె నటనకు ఫిదా అవుతున్నారు జనాలు. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా ఆ ఒక్క సినిమాతోనే లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఉప్పెనతో కృతి శెట్టి, ప్రేమలుతో మమిత బైజు, మిస్టర్ బచ్చన్‌తో భాగ్యశ్రీ, లైగర్‌తో అనన్య కూడా అలా ఫేమ్ అయిన వారే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??
ఎవరెస్ట్ శిఖరంపై కుప్పకూలిన హెలికాఫ్టర్