కోట్లలో కాసుల వర్షం.. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు వీరే!

Updated on: Aug 07, 2026 | 6:26 PM

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల పారితోషికాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా భట్ బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుండగా, దక్షిణాదిలో నయనతార అగ్రస్థానంలో కొనసాగుతోంది. సాయి పల్లవి, రష్మిక మందన్న వంటి హీరోయిన్లు కూడా కోట్లలో పారితోషికం అందుకుంటూ స్టార్ మార్కెట్‌ను మరింత బలపరుస్తున్నారు.

సినిమా అనగానే హీరోల రెమ్యునరేషన్ గురించే మాట్లాడుకుంటాం కానీ హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. ఆకాశమే హద్దుగా పారితోషికాలు అందుకుంటున్నారు. నార్త్ టూ సౌత్ ముద్దుగుమ్మలంతా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు కోటి చూడటానికే కష్టపడిన హీరోయిన్లు.. ఇప్పుడొక్క హిట్‌తోనే రేటు పెంచేస్తున్నారు. అలా రప్ఫాడిస్తున్న బ్యూటీస్ ఎవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? హీరోయిన్ల రెమ్యునరేషన్‌లో అగ్ర తాంబూలం ప్రియాంకా చోప్రాదే. తన గ్లోబల్ ఇమేజ్‌తో సినిమాకు ఏకంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నారీమె. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే కూడా తగ్గేదే లే అంటూ.. 25 నుంచి 35 కోట్ల రేంజ్‌లో పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆలియా భట్ సైతం హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా 20 నుంచి 30 కోట్ల స్థాయిలో వసూలు చేస్తున్నారు. కేవలం టాప్ 3 మాత్రమే కాదు.. బాలీవుడ్‌లోని మిగిలిన స్టార్ హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్స్ సినిమాకు 15-20 కోట్ల మధ్యలో అందుకుంటుంటే… శ్రద్ధా కపూర్, కృతి సనన్ లాంటి ముద్దుగుమ్మలు రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నార్త్‌తో పోలిస్తే సౌత్ తక్కువేమీ కాదు.. ఇక్కడ కూడా మన స్టార్ హీరోయిన్లు కోట్లల్లోనే పారితోషికాలు అందుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్లు తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా రికార్డ్ సృష్టిస్తున్నారు. సాయి పల్లవి, రష్మిక మందన్న లాంటి క్రేజీ భామలు కూడా 6 నుంచి 10 కోట్ల మధ్యలో అందుకుంటున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు హీరోయిన్లు కోటి రూపాయల పారితోషికం చేరుకోవడానికి ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడొక్క హిట్ వస్తే చాలు పారితోషికానికి రెక్కలొస్తాయి. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే రేంజ్ కూడా 2 కోట్లకు పెరిగిపోయిందని టాక్ నడుస్తుంది. మొత్తానికి మన హీరోయిన్లు కూడా హీరోలకు మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ 30 నుంచి 40 కోట్లు.. సినిమాకు 25-35 కోట్లు డిమాండ్ చేస్తున్న దీపిక పదుకొనే.. అలియా భట్‌కు స్టార్ ఇమేజ్.. సినిమాకు 20-30 కోట్లు.. కత్రినా, కియారా అద్వానీ పారితోషికం 15-20 కోట్లు.. శ్రద్ధా కపూర్, కృతి సనన్‌లకు రికార్డు రెమ్యునరేషన్.. సౌత్‌లో నయన్ టాప్.. సినిమాకు 12-15 కోట్లు.. 6-10 కోట్ల మధ్యలో సాయి పల్లవి, రష్మిక రెమ్యునరేషన్

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏజ్ జస్ట్ నంబర్.. సూర్య–జ్యోతిక స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Mrunal Thakur: మృణాల్ కెరీర్‌కు బ్రేక్ ఎందుకు..? అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణాలివే!

TTD Hundi Collection: శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us