Salaar 2: సలార్ సీక్వెల్‌లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్
తెలుగు సినీ పరిశ్రమలో సీక్వెల్స్‌పై నెలకొన్న సందేహాలు తొలగిపోతున్నాయి. సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం కదలికకు శృతి హాసన్ కారణమని డార్లింగ్ అభిమానులు చెబుతున్నారు. దేవర, కల్కి, ఖైదీ, విక్రమ్ 2 వంటి ఇతర బహుళ భాగాల చిత్రాలు కూడా వేగంగా పురోగమిస్తున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
సీక్వెల్స్ గురించి నిన్నటి వరకు ఉన్న సందేహాలు ఇప్పుడు పటాపంచలవుతున్నాయి. మేకర్స్ తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గట్టిగా చెబుతున్నారు. దేవర, కల్కి, ఖైదీ, విక్రమ్ వంటి చిత్రాల బాటలో సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం కూడా చేరింది. డార్లింగ్ అభిమానులు దీనికి శృతి హాసన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్ సందడి జోరుగా సాగుతోంది. వచ్చే నెల నుండి కల్కి సీక్వెల్ ప్రారంభమవుతుందనే వార్త ప్రభాస్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందడికి తోడు శౌర్యాంగ పర్వం వార్త మరింత ఆనందాన్ని ఇస్తోంది. శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ త్వరలోనే శౌర్యాంగ పర్వం సెట్‌లో కలుద్దాం అని చేసిన ప్రకటన, సలార్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. గత రెండు రోజులుగా దేవర సీక్వెల్ గురించి తారక్ అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ అవుతున్న పిక్.. సీతారామమ్ సీక్వెల్ సాధ్యమేనా
Toxic: కన్‌ఫర్మ్ చేసిన యష్.. చెర్రీ కోసమే వెయిటింగ్
Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా
Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్ మేజిక్ గ్యారంటీ