సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే.. పవన్‌ ఏం అయ్యేవారో తెలుసా?

Updated on: May 26, 2025 | 3:02 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది చెప్పినట్లు హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. కానీ విజయం మాత్రం అంత సులువుగా దక్కలేదు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక అసెంబ్లీ సీటును మాత్రమే గెల్చుకుంది. ఇక పవన్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. తాను గెలవడమే కాకుండా 21 స్థానాల్లో పోటీ చేసిన తన పార్టీ సభ్యులను కూడా గెలిపించుకున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అదే సమయంలో ఎన్నికలకు ముందు తను ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. అయితే పవన్ ఇలా సినిమాలు, రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారో తెలుసా? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. రీసెంట్‌గా ఓ సీనియర్ రిపోర్టర్ పవన్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే ఏమయ్యేవారో చెప్పారు. స్వయంగా పవనే ఒకప్పుడు తనతో ఈ విషయం చెప్పాడని చెప్పాడు.పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషని చెప్పిన ఆ సీనియర్ రిపోర్టర్… ఆయనది ఒక సపరేట్ స్కూల్. ప్రత్యేక ప్రపంచమన్నాడు. తాను ఒకసారి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లానని.. అప్పుడే షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన చాలా సాదాసీదాగా ఉన్నారన్నాడు. ఆ సందర్భంలో పవన్ ను చాలా విషయాలు పంచుకున్నారని… అదే క్రమంలో సినిమా యాక్టర్ కాకపోయి ఉంటే తాను ‘తోటమాలి’ అయ్యేవాడినంటూ చెప్పారని ఆ రిపోర్టర్ చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్‌ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ..

తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్.. గూగుల్‌ మ్యాప్‌ సాయంతో.. 38 ఏళ్ల ఏజ్​లో పేరెంట్స్ చెంతకు..