‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్

Updated on: Nov 20, 2025 | 12:17 PM

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై రవి తండ్రి చిన అప్పారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును స్టేషన్‌లో ఇబ్బంది పెట్టొద్దని, అతడికి ఒక కూతురు ఉందని, తక్కువ శిక్ష పడేలా చూడాలని సీపీ సజ్జనార్‌ను కన్నీటితో వేడుకున్నారు. ఈ ఘటన సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఇమ్మడి రవి.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. సినిమాలు పైరసీ చేసి లీక్ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు. గత కొన్నేళ్లుగా పైరసీ చేస్తూ చిత్రనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న ఇమ్మడి రవిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం చేసింది. అటు సీపీ సజ్జనార్ ఇమ్మడి రవి గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. అతడు కేవలం సినిమాల పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా చేశాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఇమ్మడి రవి అరెస్ట్, కేసులపై అతడి తండ్రి చిన అప్పారావు స్పందించారు. తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని అనుకున్నామని.. ఇలాంటి పని చేస్తున్నాడని తనకు తెలియదన్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. తాజాగా మరో వీడియో రిలీజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈయన. తన కొడుకును స్టేషన్ లో ఇబ్బంది పెట్టొద్దని.. అతడికి ఒక కూతురు ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఆ వీడియోలో చిన అప్పారావు ఏం మాట్లాడారంటే..”సజ్జనార్ గారు.. దయచేసి స్టేషన్ లో మా వాడిని ఇబ్బంది పెట్టకండి. మీ బాధ్యతలను కాదని వాడిని విడిచిపెట్టమని నేను అడగడం లేదు. కానీ అతడికి ఒక కూతురు ఉంది. తన గురించి తలుచుకుంటే ఏడుపోస్తుంది. కనీసం ఆ బిడ్డ గురించి ఆలోచించి తనకు తక్కువ శిక్ష పడేలా చేయండి. నా కోడలు నాతో మాట్లాడదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్

SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!

Pawan Kalyan: శభాష్ సజ్జనార్..! పవన్‌ అభినందనలు

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 18 గంటలు