వీడు సైకోకు ఏమాత్రం తక్కువ కాదు..

Updated on: Nov 18, 2025 | 3:18 PM

పైకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించినా, ఐబొమ్మ రవి టాలీవుడ్ పైరసీ వెనుక ఉన్న అసలు క్రిమినల్. కోట్లు సంపాదిస్తూనే, ప్రేమించిన వారిని, వృద్ధ తండ్రిని నిర్లక్ష్యం చేశాడు. వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన చేతులతో సినిమాలు పైరసీ చేస్తూ, సమాజానికి, తండ్రికి అన్యాయం చేశాడు. అతని ఈ ద్వంద్వ జీవితం, అనైతిక సంపాదన గురించి వివరంగా తెలుసుకోండి.

పైకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్‌ క్రిమినల్. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐ బొమ్మ రవి.. పర్సనల్‌ లైఫ్‌లో కూడా సేమ్‌ టు సేమ్‌ రోల్‌ను పోషించాడు. రియల్‌ లైఫ్‌లో ప్రేమించిన అమ్మాయిని వదిలెయ్యడంతో పాటు, అటు తండ్రిని కూడా గాలికి వదిలేశాడు. పండుటాకులా మారిన తండ్రిని పొదివి పట్టుకోవాల్సిన చేతులతో, పైరసీలు చేస్తూ అటు సమాజానికి, ఇటు తండ్రికీ చెడబుట్టిన కొడుకుగా మారాడు. తండ్రి బతకడానికి నానా అవస్థలు పడుతుంటే…కొడుకు మాత్రం మంది మీద పడి బతికేస్తున్నాడు. ఐబొమ్మ రవి కోట్లు సంపాదించినా, తండ్రికి మాత్రం నయాపైసా సాయం చేయలేదు సరికదా, ఎలా ఉన్నావు? తిన్నావా అని ఆప్యాయంగా అడగడం కూడా మానేశాడు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన చేతులు…. సినిమాలు పైరసీ చేయడంలో బిజీగా మారిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ – బొమ్మ వ్యవస్థాపకుడిగా

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా