IBomma Rav: ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌డీ సినిమా పైరసీకి శాటిలైట్ లింక్‌లు, క్యూబ్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసినట్టు రవి అంగీకరించాడు. టెలిగ్రామ్ ద్వారా ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విదేశీ సర్వర్లు, మూవీ రూల్జ్, ఇతర అడ్మిన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరు విప్పాడు. మూడోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రవిని విచారించగా, కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి పైరసీ నెట్వర్క్ వివరాలు బయటపడ్డాయి. ఐబొమ్మ రవిపై నమోదు అయిన ఐదు కేసుల్లో నాలుగు కేసుల్లో విచారణకు కోర్టు అనుమతించింది. ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజులు కస్టడీకి అనుమతి లభించింది. తాజాగా జరిగిన తొలిరోజు విచారణలో, ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఐబొమ్మ రవి హెచ్‌డీ సినిమా పైరసీపై స్పందించాడు. సినిమాల డిజిటల్ ప్రసారానికి ఉపయోగించే క్యూబ్ నెట్‌వర్క్‌ను కూడా తాను హ్యాక్ చేసినట్లు అంగీకరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్
నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ.. బోయపాటి ఎమోషనల్
Rithu Chowdary: డిమాన్ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!
