ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు
ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 20 కోట్ల విలువైన భారీ సినిమా పైరసీ రాకెట్‌ను టెలిగ్రామ్ ద్వారా నడుపుతున్నాడు. 110 వెబ్‌సైట్ డొమైన్‌లు, 21 వేల సినిమాలు అతని హార్డ్ డిస్క్‌లో దొరికాయి. కరేబియన్ పౌరసత్వం తీసుకుని దేశం విడిచి వెళ్లాలనుకున్న రవి బ్యాంక్ ఖాతాల్లో 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. ఈ అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
పట్టుకోండి చూద్దాం..అని ఖాకీలకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని కటకటాల బాటపట్టించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. వాటితో పాటే ఫారిన్ యాక్ట్ కూడా జోడించారు. ఐబొమ్మ రవి కరేబియన్ పాస్‌పోర్ట్‌తో హైదరాబాద్ వచ్చాడు.విశాఖ, హైదరాబాద్‌లో తన ప్రాపర్టీస్‌ను సేల్ చేసి కరేబియన్ దీవులకు చెక్కేయాలనుకున్నాడు. 2022లో రవి భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు.80లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్ షిప్ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐబొమ్మ రవి ..టెలిగ్రామ్ చానెల్ ద్వారా పైరసీ రాకెట్ నడిపాడన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.అతను DRM అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించినట్టు గుర్తించామన్నారు. ఐబొమ్మ రవి 110 వెబ్‌సైట్ డొమైన్స్ కొనుగోలు చేశాడన్నాడు. రవి హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. . ఐ బొమ్మ రవి అరెస్ట్‌తో చిత్రపరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు సినీ ప్రముఖులు.. కూపీలాగిన కొద్దీ సినిమాను తలపించేలా ఐబొమ్మ రవి కేసులో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. 2016 హైదరాబాద్‌కు చెందిన ముస్లిమ్‌ను యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆర్ధిక అంతరాలతో విభేదాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నారు పోలీసులు. సినిమాపై వున్న మక్కువతో పైరసీ బాటపట్టాడన్నారు.పైరసీ ద్వారా 20 కోట్లు సంపాదించాడన్నారు. రవికి 35 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. అతని ఖాతాల్లో 3 కోట్లు ఫ్రీజ్‌చేశారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్
భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు
నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే మరి !!
