Jyothika-Suriya: మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
సూర్య జ్యోతిక కుటుంబమంతా ముంబయికు షిఫ్ట్ అయ్యారు. అసలు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నదానిపై సూర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కుటుంబం కోసం తన భార్య జ్యోతిక ఎన్నో వదులుకుందని ఆమెపై ప్రశంసలు కురిపించారు. అందుకే ఆమె కోసం నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
జ్యోతిక తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకు వచ్చిందనీ తమ పెళ్లి అయిన తర్వాత అక్కడే ఉన్నామనీ సూర్య చెప్పారు. ఆమె తన కోసం, తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిందనీ ముంబయిలోని తన స్నేహితులను, కెరీర్‌ను వదులుకుందనీ తన జీవనశైలిని మార్చుకుందనీ అన్నారు. కొవిడ్ తర్వాత మార్పు అవసరం అనిపించిందనీ అందుకే ముంబయి షిఫ్ట్ అయ్యామనీ తెలిపారు. ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయనీ వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ సవాళ్లను ఎదుర్కొంటోందనీ అన్నారు. తాను గొప్ప దర్శకులతో పనిచేయాలని అనుకుంటే తను మాత్రం ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వర్క్ చేయాలనుకుంటుందనీ చెప్పారు. ఇటీవల ఆమె నటించిన ‘శ్రీకాంత్’, ‘కాదల్ – ది కోర్’ చిత్రాలు ఎంత వైవిధ్యమైనవో తెలిసిందే అనీ మహిళలకు కూడా పని విషయంలో స్వాతంత్య్రం ఉండాలని తాను భావిస్తాననీ చెప్పారు. పురుషుల వలే వారికి కూడా సెలవులు, స్నేహాలు అవసరమనీ ఇప్పుడు జ్యోతిక తన కుటుంబంతో, పాత స్నేహితులతో సమయం గడుపుతోందనీ వృత్తిపరంగాను బిజీగా ఉందనీ సూర్య తెలిపారు. తాను ముంబయిలో ఉన్న సమయంలో పనిని పూర్తిగా పక్కన పెట్టేస్తాననీ నెలలో 10 రోజులు కుటుంబానికి కేటాయిస్తా’నని చెప్పారు.
ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్‌లో హిట్ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్నట్లు సమాచారం. ‘బెంగుళూరు డేస్’ ఫేమ్ అంజలి మేనన్ దర్శకత్వంలో ఓ చిత్రం రానుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే 18 ఏళ్ల తరవాత మరోసారి వీరిద్దరిని స్క్రీన్‌పై చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సూర్య ‘కంగువా’ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.