AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక
AI టెక్నాలజీ దుర్వినియోగంపై హీరోయిన్లు శ్రీలీల, నివేదా థామస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. AI ద్వారా అభ్యంతరకర చిత్రాలను సృష్టించడం తమ గోప్యతపై దాడి అని వారు పేర్కొన్నారు. AIని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని నివేదా థామస్ హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయవద్దని ప్రజలను కోరారు.
AI టెక్నాలిజీతో ఇబ్బంది పడుతున్న హీరోయిన్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. AIతో అమ్మాయిలను అసభ్యంగా చిత్రీకరిస్తున్న వారి తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు. AIని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటూ కాస్త గట్టిగా చెబుతున్నారు. నిన్న కాక మొన్న శ్రీలీల ఇదే చెబుతూ ఓ పోస్ట్ పెట్టగా.. ఇప్పుడు నివేదా థామస్ కూడా AI అసభ్యతపై సీరియస్ అయ్యారు. AIతో తనను అసభ్యంగా చిత్రీకరించడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇది తన వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అంటూ నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఫోటోలు, వీడియోలను వెంటనే సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ షేర్ చేయవద్దంటూ కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజాసాబ్ ఈవెంట్ పై.. పోలీసులు సీరియస్
ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్..
Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
